TRS Aswaraopet former MLA Thati Venkateswarlu got Bitter experience. People throws slippers him on friday.
#TelanganaElections2018
#kcr
#TRS
#congress
#ThatiVenkateswarlu
ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. ఓ గ్రామంలో గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారిని చెప్పులతో వెంబడించారు. వారిని తరిమి తరిమి కొట్టారు. అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, ఆయన మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బంజారా గిరిజనులు ఆయనకు చెప్పులతో నిరసన తెలిపారు. ఆయన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద ఎత్తున వాహనాలతో అభ్యర్థి ప్రచారం కోసం వచ్చారు. కానీ ఘోర పరాభవం ఎదురైంది.